1. కొత్త విషయాలను నేర్చుకోవడం (learning nwe things) :-




మన మెదడు యెక్క శక్తి ని పెంచుకోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడం అనేది ఒక మంచి మార్గం. ఈ పద్ధతి మెదడులోని న్యూరో కనెక్షన్స్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మనం నేర్చుకునే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మన మెదడులో కొన్ని వందల న్యూరో కనెక్షన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. పుస్తకాలను చదవడం, కొత్త భాషలను నేర్చుకోవడం మరియు కొత్త కలలను నేర్చుకోవడం మొదలగునవి చేయడం ద్వారా మన మెదడు యొక్క శక్తిని పెంచుకోవచ్చు.


2. పోషకాహారం (healthy food) :-



ఆరోగ్యకరమైన ఆహారం తినడం సరైన పోషకాహారం తీసుకోవడం కూడా మెదడు యొక్క పనితీరును పెంచుతుంది. మనం ఎంత తింటున్నామన్నది కాదు ఏం తింటున్నామనేదే ముఖ్యం. మన పళ్లెంలో అన్ని రకాల ఆహార పదార్ధాలు ఉండేతట్టుగా చూసుకోవాలి.
మన మెదడు శక్తిని పెంచే ఆహార పదార్ధాలు:-
1.చెప
2.గుడ్లు
3.అరటి పండ్లు
4.టమాటాలు
5.తాజా ఆకుకూరలు
6.పసుపు
7.కొబ్బరి నూనె
8.నల్ల ద్రాక్షా etc...

3.మెదడు కి సంబంధించిన ఆటలు ఆడటం (brain games) :-


మన మెదడు ని ఆలోచింపచేసే కొన్ని రకాల ఆటలు ఆడడం వల్ల కూడా మన మెదడు శక్తిని పెంచుకోవచ్చు. చదరంగం, సుడుకో లాంటి ఆటలు ఆడటం మరియు కొన్ని రకాల పజిల్స్ పూర్తి చెయ్యడం వల్ల మన రేషనల్, లాజికల్, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్ధ్యం అనేది పెరుగుతుంది.

4.ధ్యానం (meditation) :-


ప్రతిరోజు consistant గా ధ్యానం చేయడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా మన ఒత్తిడి, ఆందోళన మరియు ఉద్రిక్తతలను తగ్గించి మన మనసును ప్రశాంత పరుస్తుంది. సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే ఎవరైతే రోజూ ధ్యానం చేస్తారో వాళ్లు మిగతా వారికంటే ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. దీని ద్వారా మనం చేసే పని మీద ఏకాగ్రత కలిగి మనం చేసే పనిలో త్వరగా విజయం సాధించడానికి సహాయ పడుతుంది.

5.వ్యాయామాలు (exercises)



ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మన మెదడులోని న్యూరో కనెక్షన్స ను పెంచుకోవచ్చు.
    మన శరీరంలోని ఎడమ వైపు భాగం మెదడు మన కుడివైపు శరీరాన్ని అదుపు చేస్తుంది. మన శరీరంలోని కుడివైపు భాగం మెదడు మన ఎడమ వైపు శరీరాన్ని అదుపు చేస్తుంది. మన ఎడమ భాగం మెదడు లాజికల్ గా, మనం విన్నవి మాట్లాడినవి ఇంకా మన అనుభవాలకు తగ్గట్టుగా ఆలోచిస్తుంది. మన కుడివైపు భాగం మెదడు creative గా emotional గా ఆలోచిస్తుంది. మనం ఎడమవైపు శరీర భాగాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా మనలో emotional థింకింగ్ అనేది పెరుగుతుంది. మనం కుడివైపు శరీర భాగాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా మన లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా బ్రెయిన్ gym లాంటి కొన్ని వ్యాయామాలలో మన రెండు వైపుల శరీరాలని ఉపయేగిస్తాం. దాని ద్వారా మనం ఒకే సమయంలో లాజికల్ గా ఇంకా ఎమోషనల్ గా కూడా ఆలోచించగలుగుతాం. దాని ద్వారా మనం super learning అనే సామర్ధ్యాన్ని పొందుతాం అంటే మనం ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చుకోగలుగుతాం.

may like :-

how to achieve success in telugu

how to become rich in telugu