HOW TO START YOUR DAY POSITIVELY:-
మనం ఉదయం నిద్ర లేవగానే ఆలోచించే ఆలోచనలే మన రోజు మొత్తాన్ని నిర్దేశిస్తాయి. ఇది నిజం. ఎలా అనుకుంటున్నారా? రాత్రంతా నిద్రలో విశ్రాంతి తీసుకున్న మన మెదడు ఉదయం లేవగానే చాలా ఫ్రెష్ గా ఉంటుంది, అలాగే subconscious state లో ఉంటుంది. subconscious అంటే ముందుగా మన మెదడు రెండు రకాలుగా ఉంటుంది.
1. conscious mind
2. subconscious mind
conscious mind అంటే మనకు తెలిసి, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు, చేసే పనులను conscious mind చేస్తుంది. మనకు తెలియకుండా మనం ఆలోచించే ఆలోచనలను చేసే పనులను subconscious mind చేస్తుంది. ఉదాహరణకు మనం సైకిల్ నేర్చుకుంటున్న మొదటిలో చాలా శ్రద్ధ పెట్టి మన ఆలోచనలన్నీ దాని మీదె పెట్టి తొక్కుతాం. దీనినే మనం conscious mind అంటాం. కానీ సైకిల్ అలవాటు అయిన కొన్ని రోజులకి ఏవేవో ఆలోచిస్తూ అసలు దాని మీద శ్రద్ధ పెట్టకుండానే automatic గా తొక్కేస్తాం. దీనినే మనం subconscious mind అంటాం. మనం ఏదైనా కొత్త పనులు చేస్తున్నప్పుడు మన conscious mind పనిచేస్తుంది. అవే పనులు అలవాటైన తరువాత మన subconscious mind పనిచేస్తుంది. మన రోజులో 95 శాతం subconscious mind పనిచేస్తుంది. ఒక్క 5 శాతం మాత్రమే conscious mind పనిచేస్తుంది. మనం ఉదయం నిద్రలేవగానే మన subconscious mind active గా ఉంటుంది. ఈ సమయంలో మనం మంచిగా ఆలోచిస్తే రోజంతా మంచి గా ఉంటుంది. ఈ సమయంలో మనము చెడు గా ఆలోచిస్తే రోజంతా చెడుగానే ఉంటుంది. మన రోజు మొత్తాన్ని మన అదుపు లోకి తెచ్చుకోవడానికి ఉదయం నిద్రలేవగానే మనం ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి.
1. నా జీవిత లక్ష్యం ఏమిటి?
2. నా లక్ష్యాన్ని సాధించడానికి నాకు ఏం కావాలి?
3. నా లక్ష్యాన్ని సాధించాలంటే నేను ఈరోజు ని ఎలా ఉపయోగించుకోవాలి?
మీరు ఈ మూడు ప్రశ్నలు వేసుకోవడం ద్వారా ఆ రోజు మీరు ఏం చెయ్యాలో ఒక క్లారిటీ వస్తుంది. సమయాన్ని వృథా చెయ్యరు. అంతేకాకుండా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది.
may also like :-
3 habits to achieve success in telugu
chanikya philosophies on friendship in telugu


0 Comments