THE MINDSET OF A SUCCESSFUL PEOPLE IN TELUGU :-

         మనుషులందరూ ఒకలా ఉండరు. కొంతమంది బాగా తెలివిగా, మంచి వారిగా ఉంటారు. మరికొంతమంది క్రూరంగా కోపంగా ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతి మనిషి ఆ సమస్యకు ఒకేలా రియాక్ట్ ఎవరు. ఎవరి point of view లో వాళ్లు ఆలోచిస్తారు ఈ ఆలోచనా తీరు నే mindset అంటున్నాం. ఈ mindset మనుషులలో రెండు రకాలుగా ఉంటుంది.

1.FIXED MINDSET

2.GROWTH MINDSET

1.FIXED MINDSET :-

           ఈ mindset లో ఉన్నవాళ్లు ఏం నమ్ముతారు అంటే తెలివితేటలు, అలవాట్లు, స్వభావాలు అంటే ధైర్యం, సాహసం వంటివి ఒక మనిషి పుట్టినప్పుడే సహజంగా వస్తాయని వాటిని మనం మార్చడం కానీ అభివృద్ధి చేసుకోవడం గానీ కుదరదని నమ్ముతారు.
         ఇంకా వాళ్ల లో ఉన్న బలహీనతలను బయటకి కనబడని ఇవ్వరు. అన్ని చోట్ల వాళ్లని వాళ్లు prove చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
            ఎవరైనా ఎందులోనైనా విజయం సాధిస్తే అది వాడి అదృష్టం అని నాకు ఆ అదృష్టం లేదు అని అందుకే నేను ఏమీ చేయలేనని భావిస్తారు. ఇక రెండోది

2.GROWTH MINDSET :-

           ఈ growth mindset లో ఉన్నవాళ్లు ఏం నమ్ముతారు అంటే ఒక మనిషికి ఉండే తెలివితేటలు, అలవాట్లు స్వభావాలు ఇవన్నీ కేవలం things మాత్రమేనని మన effort and practice ద్వారా వాటిని మార్చుకుని అభివృద్ధి చేసుకోవచ్చు అని నమ్ముతారు.
        ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలదని.
        ప్రపంచ మేధావి అయిన Einstein ఇంకా మన దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటివారు స్కూల్స్ లో చదివేటప్పుడు top rankers కాదు అయినా గొప్పవాళ్ళు అయ్యారు.ఒక సాధారణ తెలివితేటలు గల వ్యక్తి సరైన motivation ఇంకా ప్రయత్నం ద్వారా గొప్పవారిగా మారవచ్చని వీళ్ళు నమ్ముతారు.

ఇప్పుడు ఒకే situation పై ఈ రెండు mindset ల గల వాళ్లు ఎలా ఆలోచిస్తారో చూద్దాం..
            ఒకతను గవర్నమెంట్ జాబ్ సాధించాలని 6 నెలల నుండి కష్టపడి చదివి exam రాయగా కొద్దిగ లో ఆ జాబ్ మిస్సయింది.
దానికి  fixed mindset ఉన్న వారైతే ఎలా ఆలోచిస్తారు అంటే
"ఇక నావల్ల కాదు......,
"నేను ఏమీ సాధించలేను..."
" ఎంత కష్టపడినా నాకు ఇక జాబ్ రాదు....”
“ఈ లోకంలో నా అంత దురదృష్టవంతులు ఎవరూ లేరు.....”
“నా శ్రమ అంత వృధా అయిపోయింది..”
ఇలా ఫుల్ గా నెగిటివ్ గా ఆలోచిస్తారు.

ఇదే growth mindset కి సంబంధించిన వారైతే మొదట బాధపడినా...
“నాకు ఆ జాబ్ రాకపోయినా నేను చివరి వరకు వెళ్ళగలిగాను.. తర్వాత జరగబోయే exam కి నేను మరింత కష్టపడతాను”
“నేను ఈ exam లో చేసిన తప్పులను సరి చేసుకుని తర్వాత పరీక్షల కి మరింత జాగ్రత్తలు తీసుకుంటాను”
“ఎదీ నన్ను ఆపలేదు...”
“నేను తర్వాతి పరీక్షకు మరింత కష్టపడి ప్రయత్నిస్తాను”
“ఏదేమైనా నేను అనుకున్నది సాధించి తీరుతాను” ఈ విధంగా ఆలోచిస్తారు.

 అసలు మనం మన బలహీనతలను ఎందుకు దాయడం? వాటిని మనం ఎందుకు అధిగమించకూడదు?...

ఎందుకు మనం తెలివైనవారిమని prove చేసుకోవడం? దానికి బదులుగా మనల్ని మనం ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు?

ఇటువంటి mindset మనల్ని మన జీవితంలో వచ్చే కష్టకాలాన్ని జయించి మరింత మనం అభివృద్ధి nచెందడానికి సహాయపడుతుంది.

may also like :-

how to start your day positively in telugu

how to achieve success in telugu | success formula

follow me on :-

https://www.facebook.com/Telugu-top-learnings-518803538867176/