ఈ ఒక్క formula మన జీవితాన్నే మార్చేస్తుంది. అదేంటో చెప్పబోయే ముందు ఒక చిన్న కథ చెప్తాను వినండి. రాము అనే వ్యక్తి “నేను బాగా లావయ్యాను ఎలాగైనా బరువు తగ్గాలి” అని అనుకొని రేపటినుండి జిమ్ కి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు జిమ్ కు వెళ్ళాడు. ఎలాగైనా బరువు తగ్గాలి అనుకున్న రాము జిమ్ కి వెళ్ళిన మొదటి రోజే నాలుగు గంటలు ఆపకుండా హెవీ ఎక్సర్సైజెస్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు. బాగానే ఉంది.
కానీ తరువాత రోజు ఉదయం మళ్లీ జిమ్ కి వెళ్లాలనుకునే సరికి ముందు రోజు చేసిన exercise ల ప్రభావం వల్ల వళ్లు నొప్పులు పుట్టి ఈ జిమ్ లు అవి మనకు అవసరమా చక్కగా మనకున్న దానితో సంతోష పడక అని తనకు తాను సర్దిచెప్పుకొని చేద్దామనుకున్న పనికి మొదటిలోనే ఫుల్ స్టాప్ పెట్టేసాడు.
ఇలా రాము విషయంలోనే కాదు మనందరికీ జరుగుతుంది. ఎంతమంది ఒక్కరాత్రి చదివి exam లో టాప్ ర్యాంక్ సాధించాలని బోల్తా పడ్డారు?... ఎంతమంది ఒక్కరోజు ప్రాక్టీస్ ఐ గవర్నమెంట్ జాబ్ కొట్టారు?... ఇప్పుడు నేను చెప్పబోయే formula. ప్రతీ ఒక్కరూ వాళ్ల అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే
small choices + consistency + time = radical difference
అంటే “మనం మన జీవితంలో తీసుకునే చిన్నచిన్న తెలివైన నిర్ణయాలు ప్రతిరోజు టైం కి పాటిస్తే కొంతకాలానికి అవే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకు వస్తాయి”.
ఇందాకడ కథలో చెప్పుకున్న రాము ఒకే రోజు హెవీ గా exercises చెయ్యకుండా. చిన్న చిన్న exercise ల తో మొదలుపెట్టి ప్రతిరోజు 30 నిమిషాలు జిమ్ కి వెళ్తూ సరైన ఆహారం తీసుకుంటే సమయం పట్టినా కొంతకాలానికి బరువు తగ్గేవాడు.. exam కి ముందు రోజు రాత్రి కష్టపడి చదివడం కన్నా కొద్దిగా ముందు నుండే రోజుకి గంట చొప్పున ప్రతిరోజు ఇష్టపడి చదివితే exam లో టాప్ ర్యాంక్ తెప్పుంచుకోవచ్చు. ఈరోజు విత్తనం వేస్తే రేపటికి మొక్క మొలవదు అలాగే ఒక్క రాత్రిలో ఎవరు గొప్ప వాళ్ళు కాలేరు. దేనికైనా టైం పడుతుంది. చిన్నగా మొదలుపెట్టినా ప్రతిరోజు consistent గా పాటిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.
you may like :-
chanikya philosophies on friendship in telugu
how to increase brain power in telugu


0 Comments