HOW TO BECOME RICH :-
ప్రపంచం మొత్తం మీద, 50 భాషలలో సుమారు 41 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని రాసిన రాబర్ట్ కియోసాకి తన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో డబ్బు సంపాదించే విధానాలను E,S,B,I అనే 4 క్వాడ్రెంట్స్ గా విడదీశారు. అందులో..
E అంటే Employ
S అంటే Self employ
B అంటే Big business
I అంటే Investment
1.Employe ( E ) :-
ఈ క్వాడ్రెంట్ లో డబ్బు సంపాదించే వారిని రాబర్ట్ కియోసాకి ఎంప్లాయిస్ అని అన్నారు. వీళ్లు డబ్బు కోసం వేరే వాళ్ల దగ్గర పని చేస్తారు. వీళ్ళకి వారానికో లేక నెలకో ఫిక్సెడ్ శాలరీ వస్తుంది. వీళ్లు ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. వీళ్ళ జీవితం 20 ఏళ్లకు ఎలా ఉంటుందో 40 ఏళ్లకు కూడా అలాగే ఉంటుంది. పెద్దగా ఎదుగుదలని మనం చూడం.
ఉదాహరనకు ఏదైనా కంపెనీలలో ఉద్యోగం చెయ్యడం. ఇంక రెండో క్వాడ్రెంట్ కి వచ్చేసరికి
2. Self employ (S) :-
ఈ క్వాడ్రెంట్ లో ఉండేవారు సెల్ఫ్ ఎంప్లాయిస్. వీళ్లు వేరే వాళ్ల దగ్గర పని చెయ్యరు. వీళ్ళ కంటూ ఒక చిన్న బిజినెస్ ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది.
ఉదాహరణ కు చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ గ్యారేజ్ ఓనర్స్ etc...
పైన చెప్పిన 2 రకాలుగా వచ్చే డబ్బును active income అంటారు. అంటేే వీళ్లు పనిచేస్తేనే డబ్బు వస్తుంది.
3. Big business (B) :-
ఈ క్వాడ్రెంట్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు పెద్దపెద్ద వ్యాపార వేత్తలు ఉంటారు. ఈ పెద్ద పెద్ద వ్యాపారాల కోసం మొదటి క్వాడ్రెంట్ లో చెప్పిన తెలివైన ఎంప్లాయిస్ పని చేస్తారు. ఈ క్వాడ్రెంట్ లో వాళ్లు ఎక్కువగా పని చేయకపోయినా వీళ్ళ కోసం ఎంప్లాయిస్ పనిచేయడం ద్వారా వీళ్లకు ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి కంపెనీలు వీటికి ఉదాహరణలు.
4.investments (I) :-
ఈ క్వాడ్రెంట్ లో వాళ్లు డబ్బు కోసం పని చెయ్యరు, వీళ్ళ కోసమే డబ్బు పనిచేస్తుంది. వీళ్లను ఇన్వెస్టర్స్ అంటారు. అంటే వీళ్లు వీళ్ల దగ్గర ఉన్న డబ్బును స్టాక్ మార్కెట్, మ్యూచువల్ బాండ్స్ ఇంకా రియల్ ఎస్టేట్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు అంటే పెట్టుబడి పెడతారు. దానిద్వారా ఆ డబ్బు మరింత డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది.
పైన చెప్పిన big business ఇంకా investment ద్వారా వచ్చిన డబ్బును passive income అంటారు. ఎందుకంటే వీళ్లు పని చేయకపోయినా డబ్బు వస్తుంది. కానీ వీటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
సుమారు 95% జనాలు ఎంప్లాయిస్ ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిస్ గానే ఉంటున్నారు. ఒక్క ఐదు శాతం జనాలు మాత్రమే బిజినెస్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ను ఎంచుకుంటున్నారు. మనం కూడా బిగ్ బిజినెస్ ఇంకా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా త్వరగా ధనవంతులం అయ్యే అవకాశం ఉంది.
కానీ ఏం చేసినా మీకు నచ్చిన పని చేయండి. మీకు ఇష్టమైన పని చేయడం ద్వారా మీకు ఆనందం అలాగే చేసే పని మీద శ్రద్ద ఉండడం వల్ల త్వరగా సక్సెస్ అవుతారు.
may also like :-
how to achieve success in telugu
chanikya philosophies on friendship in telugu


0 Comments